డాక్టర్లు చనిపోయారని చెప్పడంతో శవాల బ్యాగ్‌లోకి ఎక్కించిన ఓ వ్యక్తి తిరిగి బతికిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘైలో ఒక కరోనా పేషెంట్ చనిపోయాడని భావించి మృత దేహాలను తరలించే వ్యానులోకి ఎక్కించారు. అయితే వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న క్రమంలో బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులోని వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని గుర్తించారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.