మెట్రో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

By udayam on January 6th / 12:34 pm IST

హైదరాబాద్ మెట్రో రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూసాపేట మెట్రో స్టేషన్ లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదిగంటల సమయంలో మెట్రో రైలు వస్తుండగా అకస్మాత్తుగా పట్టాలపైకి దూకాడు. రైలు ఆ వ్యక్తిపైనుండి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టికెట్ లేకుండానే అతడు లోపలికి వెళ్లినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్​