పుల్కా తినేసిందని ఎద్దును చంపేశాడు

By udayam on September 14th / 11:10 am IST

తన పుల్కా బండి వద్ద ఉన్న పుల్కాలను తినేసిందన్న కోపంతో ఆ వ్యాపారి ఓ ఎద్దును ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఏలూరు డీమార్ట్​కు సమీపంలో జరిగిన ఈ ఘటనలో రాజస్థాన్​కు చెందిన పుబారామ్​ అనే వ్యక్తి రోజూ ఆ ఎద్దుకు పుల్కాలు పెడతాడు. అయితే నిన్నటి రోజున మాత్రం అది పుల్కా బండిలోకి నోరు పెట్టి కొన్నింటిని తినేయడంతో యజమాని కోపంతో పక్కనే ఉన్న రాడ్డుతో ఎద్దును బాదేశాడు. ఆ క్రమంలో కింద పడ్డ ఎద్దు అక్కడికక్కడే చనిపోయింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్​