లిఫ్ట్​ ఇస్తే.. ఇంజెక్షన్​ చేసి హత్య!

By udayam on September 20th / 5:35 am IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ పిఎస్​ పరిధిలో షాకింగ్​ ఘటన జరిగింది. బైక్ పై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి, వెనక కూర్చున్న వ్యక్తి ఇంజెక్షన్ తో పొడిచి చంపేశాడు. ఘటనా స్థలంలో నీడిల్‌తో పాటుగా అనుమానాస్పద ఇంజెక్షన్ సంబంధిత వస్తువులు కనిపించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మృతుడి బంధువులు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. 51 ఏళ్ళ మృతుడికి ఎలాంటి వ్యక్తిగత తగాదాలు లేవని, అసలు ఈ హత్య ఎందుకు జరిగిందన్నది తమకూ తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్​