విశాఖ డ్రమ్ములో మహిళ మృతదేహం కేసు.. నిందితుడు అరెస్ట్​

By udayam on December 7th / 11:13 am IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ డ్రమ్ములో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా బమ్మిడి ధనలక్ష్మి (24)గా గుర్తించి నిందితుడు రిషి వర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి పంపించిన అతడు ఆపై ధనలక్ష్మి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆమె రూ.2 వేలు అడగడంతో ఆ డబ్బు విషయమై ఇరువురి మధ్యా గొడవ జరిగి రిషి ఆమెను చున్నీతో మెడ బిగించి చంపేసి డ్రమ్ములో కుక్కేశాడు. ఆ తర్వాత ఇళ్ళు ఖాళీ చేసి పరారయ్యాడు.

ట్యాగ్స్​