న్యూయార్క్​: 300 ఐఫోన్లు కొన్నాడు.. సెకండ్లలో పోగొట్టుకున్నాడు

By udayam on December 1st / 11:32 am IST

దాదాపు రూ.1.80 కోట్లు ఖర్చు పెట్టి 300లకు పైగా ఐఫోన్లను కొన్న ఓ వ్యక్తి వాటిని కార్లో పెట్టడానికి వెళ్ళే క్రమంలోనే పోగొట్టుకున్నాడు. న్యూయార్క్​ ఫిఫ్త్​ అవెన్యూ వీధిలో ఉన్న ఓ యాపిల్​ స్టోర్​ లో సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ చోరీ జరిగింది. ఐఫోన్​ 13 ఎస్​ లను బ్యాగ్స్​ లో సర్దుకుని కార్​ వద్దకు వెళ్తున్న అతడిని ఫాలో అయిన దొంగలు.. కారుతో గుద్ది కింద పడేసి అతడి వద్ద నుంచి 125 ఐఫోన్లను కొట్టేశారు. పోయిన ఐఫోన్ల విలువ రూ.77 లక్షలుగా ఉంది. మోసపోయిన వ్యక్తి భారీ మొత్తంలో ఐఫోన్లను కొన్ని తిరిగి అమ్మకం జరుపుతుంటాడు.

ట్యాగ్స్​