చైనా నుంచి ఆదివారం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఓ 35 ఏళ్ళ భారతీయ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో అతడిని ఈరోజు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి శాంపిల్ ను జీనోమిక్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. గత శుక్రవారం కూడా చైనా నుంచి ఆగ్రా వచ్చిన 40 ఏళ్ళ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. కరోనా పుట్టినిల్లు చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న కొవిడ్ వేరియంట్ బిఎఫ్.7 అత్యంత ప్రమాదకారిగా భారత ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.