విమానాలు హైజాక్​ చేస్తానంటూ ఫోన్​.. అరెస్ట్​

By udayam on June 9th / 11:12 am IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​, ఇండోర్​ ఎయిర్​పోర్టుల్లో విమానాలను హైజాక్​ చేసి ప్రయాణికుల్ని పాకిస్థాన్​కు తీసుకెళ్తానంటూ ఓ వ్యక్తి ఫోన్​లో బెదిరింపులకు దిగాడు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి భోపాల్​లోని రాజ భోజ్​ ఎయిర్​పోర్ట్​కు కాల్​ చేసి ఇలా బెదిరించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిన్న రాత్రి భోపాల్​కు 100 కి.మీ దూరంలోని షుజల్​పూర్​ పట్టణంలో 34 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం అతడిని అన్ని రకాలుగానూ ప్రశ్నిస్తున్నామని, ఆ విమానాశ్రయాల్లో సెక్యూరిటీని పెంచినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​