మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వ్యక్తి సులభ్ కాంప్లెక్స్‌లోనే మటన్ షాపును పెట్టేశాడు. ఆ పట్టణ మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు పబ్లిక్ టాయిలెట్స్‌లో సదుపాయాల్ని తనిఖీ చేస్తుండగా ఈ విషయం బయటపడింది.
అయితే ఇలాంటి పనిచేసిన ఆ వ్యక్తికి కేవలం రూ.1000 మాత్రమే జరిమానాగా విధించడం గమనార్హం. అయితే సులభ్ కాంప్లెక్స్‌కు మాత్రం భారీగా రూ. 20వేలు జరిమానా విధించారు.
దీనిపై ఇండోర్ మున్సిపల్ కమిషనర్ ప్రతిభ పాల్ మాట్లాడుతూ సులభ్ కాంప్లెక్స్‌లలో సదుపాయాలపై తనిఖీలు చేపట్టాం. లోహ మండిలోని ఓ పబ్లిక్ టాయిలెట్లో ఓ వ్యక్తి గుడ్లు, మటన్ అమ్ముతున్నాడని గుర్తించాం. ఒక ట్రే నిండా గుడ్లు, ప్యాక్ చేసిన మటన్ ఉంది. దీంతో అతడితో పాటు, సులభ్ కాంప్లెక్స్ నిర్వహాకులకు జరిమానా వేశాం అని వెల్లడించారు.