చికెన్​ టిక్కా మసాలా సృష్టికర్త మృతి

By udayam on December 22nd / 11:24 am IST

ప్రపంచవ్యాప్తంగా మాంసం ప్రియులకు అత్యంత ఇష్టమైన వంటకాల్లో ఒకటైన చికెన్​ టిక్కా మసాలా సృష్టికర్త మిస్టర్​ అలీ సోమవారం మరణించారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. పాకిస్థాన్​ కు చెందిన అహ్మద్​ అస్లాం (ఇతడినే మిస్టర్​ అలీగా పిలుస్తారు) స్కాట్లాండ్​ లో సెటిల్​ అయ్యాడు. ఈ క్రమంలో 1964లో గ్లాస్గో లో షిష్​ మహల్​ రెస్టారెంట్​ ను ఓపెన్​ చేసి ఈ కొత్త రకం వంటకాన్ని తయారు చేసేవాడు. ఇది కాస్తా అతడిని ప్రపంచప్రఖ్యాత చెఫ్​ గా మార్చి పేరు ప్రఖ్యాతల్ని తీసుకొచ్చింది.

ట్యాగ్స్​