4:44 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

బిల్లా – రంగా వీళ్ళతో రీమేక్ కానుందా ? 2 weeks ago

కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతాయి. మరికొన్ని కాంబినేషన్స్ వారసులతో రిపీట్ అవుతుంటాయి. ఒకప్పుడు  మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్‌కింగ్ మోహ‌న్ బాబు క‌లిసి న‌టించిన ‘బిల్లా రంగా’ సినిమా మంచి హిట్ అందుకుంది. అలాగే ‘పట్నం వచ్చిన పతివ్రతలు( మూవీ కూడా బాగానే ఆడింది. అయితే ఇప్పుడు భిల్లా రంగా మూవీ రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చిందట. అయితే ఈ మూవీని మెగా మేనల్లుడు,కలెక్షన్ కింగ్ తనయుడు కల్సి చేయబోతున్నారట.

హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంచు మ‌నోజ్ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశాడు. ఈ సంద‌ర్భంగా అప్ప‌టి సూప‌ర్‌హిట్ `బిల్లా రంగా` పోస్ట‌ర్‌ను సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ ట్విట‌ర్‌కి ట్యాగ్ చేసాడు. ‘బిల్లారంగా విడుద‌లై నేటికి  38 సంవత్సరాలు పూర్త‌యింంది, ఈరోజే నీ పుట్టిన‌రోజు కావ‌డం విశేషం.. అంటే ఈ ర‌కంగా మ‌న‌కు ఏదో హింట్ ఇస్తున్న‌ట్లుంది బాబాయ్.. ఇది చేయ‌డానికి నేను రెడీ.. నువ్వు రెడీనా ‘ అంటూ మ‌నోజ్ ట్వీట్ చేశాడు.

దీంతో మ‌రికొన్ని రోజుల్లోనే బిల్లా రంగా రీమేక్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావచ్చని అంటున్నారు. విభిన్న చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్ కి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇక 34వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన సంద‌ర్భంగా తేజ్‌కు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి.