త్వరలో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నానని సినీ నటుడు మంచు మనోజ్ ఈరోజు ప్రకటించాడు. కడప పెద్ద దర్గాను దర్శించుకున్న ఈ యువ హీరో అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎప్పటినుంచో దర్గాకు రావాలని అనుకుంటున్నానని.. ఇప్పటికి ఆ కల నెరవేరిందన్నారు. త్వరలో కుటుంబంతో కలిసి మళ్లీ దర్గాకు వస్తానని వెల్లడించాడు. అయితే అతడు కొత్త జీవితం అన్నది త్వరలోనే మరో పెళ్ళి చేసుకోవడమేనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.