ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు : విష్ణు

By udayam on July 21st / 11:37 am IST

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్​, ఏఎన్నార్​, దాసరి నారాయణరావులాంటి పెద్దలు ఉండి సమస్యల్ని పరిష్కరిచేవారని, ఇప్పుడు అలా పెద్ద దిక్కు ఎవరూ లేరని నటుడు మంచు విష్ణు వ్యాఖ్యానించాడు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న అతడు ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బాధ్యతారాహిత్యంగా, నోటికొచ్చింది మాట్లాడుతున్నారని, వారంతా జైలుకెళ్ళకుండా బయట తిరుగుతున్న మనుషులని విమర్శించాడు.

ట్యాగ్స్​