‘మా’ అధ్యక్షుడిగా మంచు ప్రమాణం

By udayam on October 16th / 10:38 am IST

గత ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేప్టటాడు. ఇదివరకే ఈ బాధ్యతలు చేపట్టి తొలి సంతకం కూడా చేసేసిన విష్ణు.. తాజాగా అతడి ప్యానెల్​ సభ్యులతో కలిసి మరోసారి ప్రమాణ స్వీకారం చేశాడు. ఫిలింనగర్​ కల్చరల్​ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు ప్రకాష్​ రాజ్​ ప్యానెల్​ నుంచి ఒక్కరూ కూడా హాజరుకాలేదు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్​, మోహన్​ బాబు, నరేష్​తో పాటు పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు.

ట్యాగ్స్​