డెంగ్యూ బారిన మన్మోహన్​

By udayam on October 17th / 7:10 am IST

గత బుధవారం జ్వరంతో ఎయిమ్స్​లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యం కుదుటపడుతోందని డాక్టర్లు ప్రకటించారు. ఆయనకు డెంగ్యూ అని తేలిందని, అయినప్పటికీ ఆయన ప్లేట్లెట్లు పెరుగుతూ ఆయన ఆరోగ్యం కూడా మెరుగైందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్​ మాండవియా ఆదివారం మన్మోహన్​ను కలిశారు.