కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ప్రకటించారు. చాలా బాధతో రాజీనామా చేసినట్లు వెల్లడించారు.పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాసినట్లు చెప్పారు.‘‘కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయాను.పార్టీలో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.తెలంగాణ బాగు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తెరాసతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది. కాంగ్రెస్‌లో నేటి పరిస్థితి ఎప్పుడూ ఊహించలేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైంది’’ అని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.