అంగారకుడిపై రహస్య తలుపులు?

By udayam on May 19th / 11:51 am IST

అంగారక గ్రహ ఉపరితలాన్ని పరిశీలిస్తున్న నాసాకు చెందిన క్యురియాసిటీ రోవర్​ తీసిన ఒక ఫొటో నెట్లో వైరల్​గా మారింది. అక్కడి జెజిరో క్రేటర్​ వద్ద ఈ రోవర్​ తీసిన ఫొటోలో పెద్ద బండరాయి లోపలకి వెళ్ళడానికి వీలుగా తలుపు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలను 3 రోజుల క్రితం నాసా తన అధికారిక ట్విట్టర్​ హ్యాండిల్​లో షేర్​ చేయగా అవి ప్రస్తుతం వైరల్​గా మారాయి. అయితే ఇందులో ఎలాంటి తలుపు లేదని, రాయికి ఏర్పడ్డ భారీ బీటలే ఇలా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ట్యాగ్స్​