పర్సవరెన్స్​ ల్యాండింగ్​ ఎలా అయిందంటే?

వీడియో విడుదల చేసిన నాసా

By udayam on February 23rd / 9:55 am IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుణ గ్రహం పైకి తాజాగా పంపిన పర్సవరెన్స్​ రోవర్​ ఆ గ్రహంపై ల్యాండింగ్​ జరిగిన వీడియోను రిలీజ్​ చేసింది.

ఇప్పటి వరకూ ఆ గ్రహంపై కి పంపిన రోవర్లు ఎలా ల్యాండ్​ అవ్వాలో ఇక్కడే ముందుగా ప్రోగ్రామ్​ చేసి నాసా పంపుతోంది. అయితే మొదటి సారిగా అక్కడ రోవర్​ ల్యాండ్​ అయ్యే విధానాన్ని కెమెరాలతో రికార్డ్​ చేసింది.

ల్యాండర్​ ను కిందకు దించే క్రేన్​కు అమర్చిన కెమెరాల సాయంతో ఈ వీడియోను రూపొందించింది.

దాంతో పాటు అక్కడి ఉపరితలంపై పర్సవరెన్స్​ రోవర్​ చేస్తున్న డ్రిల్లింగ్​ వల్ల వస్తున్న శబ్దాలను సైతం నాసా విడుదల చేసింది.

ఈ రోవర్​లో అంగారక గ్రహంపై వచ్చే శబ్దాలను వినడానికి వీలుగా రెండు మైక్రోఫోన్లను నాసా అమర్చింది. దీంతో అక్కడి శబ్దాలు రికార్డై భూమికి చేరుతున్నాయి.

ట్యాగ్స్​