న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి మార్టిన్ గప్తిల్ వైదొలిగాడు. అతన్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి విడుదల చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే కివీస్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్ హోం తప్పుకున్నారు. తాజాగా గప్తిల్ కూడా తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని మార్టిన్ గప్తిల్ అన్నాడు. ఇన్నాళ్లు మద్దతు ఇచ్చిన జట్టు, క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు.కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి, విదేశీ లీగుల్లో ఆడేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ను వదులుకుంటున్నట్లు చెప్పాడు.