కార్లను వెనక్కి పిలుస్తున్న మారుతీ–సుజుకి

By udayam on December 7th / 6:40 am IST

సీట్​ బెల్ట్​ లోపాలను సరిచేసేందుకు దేశవ్యాప్తంగా 9,125 కార్లను మారుతి–సుజుకి సంస్థ రీకాల్​ చేస్తోంది. ఫ్రంట్​ సీట్లలోని సీట్​ బెల్టుల్లో షోల్డర్​ హైట్​ అడ్జస్టర్​ వద్ద లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ విడిపోతోంది. దాంతో, ఆ లోపాన్ని సవరించేందుకు కార్ల రీకాల్ ప్రకటించారు. 2022 నవంబరు 2వ తేదీ నుంచి నవంబరు 28వ తేదీ మధ్య తయారైన గ్రాండ్ విటారా, బ్రెజా, సియాజ్, ఎక్స్ఎల్-6, ఎర్టిగా మోడళ్ల కార్లను వెనక్కి పిలుస్తోంది.

ట్యాగ్స్​