ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం దేశ ప్రజలకు మరోసారి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. దేశంలో కొవిడ్ 4వ వేవ్ రావొచ్చన్న సంకేతాల నేపధ్యంలో ప్రజలు జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మాస్క్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. దీంతో పాటు ఇప్పటికే 2 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవడానికి వెనుకంజ వేయొద్దని పేర్కొంది. చైనాలో కొవిడ్ వ్యాప్తికి కారణమైన బీఎఫ్-7 వేరియంట్ తో మన దేశంలోనూ 3 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.