NEO 2022 QP3: భూమికి అత్యంత దగ్గరగా భారీ ఆస్టరాయిడ్​

By udayam on August 29th / 7:38 am IST

భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్​ ఒకటి ఈరోజు మన గ్రహానికి అత్యంత సమీపం నుంచి వెళ్ళనుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. NEO 2022 QP3 పేరుతో పిలుస్తున్న ఈ 100 అడుగల విస్తీర్ణంతో ఉన్న ఆస్టరాయిడ్​ భూ గ్రహానికి 5.51 మిలియన్​ మైళ్ళ దూరం నుంచి సోమవారం ఉదయం 3.25 గంటలకు వెళ్ళనుంది. సెకనుకు 7.93 కి.మీ.ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత దగ్గరగా ఇటీవల కాలంలో మరే ఇతర ఆస్టరాయిడ్​ కూడా రాలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ట్యాగ్స్​