తిరుమల లో అగ్ని ప్రమాదం

By udayam on May 4th / 5:29 am IST

తిరుమల శ్రీవారి ఆలయ సముదాయంలో ఉన్న షాపుల వద్ద ఈరోజు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తాన మండపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రూ.10లక్షలకు విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. దాదాపు 10 షాపులకు వ్యాపించిన మంటల్ని అదుపు చేయడానికి అగ్నిమాపక దళం ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదానికి షార్ట్​సర్క్యూట్​నే కారణంగా భావిస్తున్నారు. కరోనా కారణంగా భక్తుల రద్దీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్​