ట్రాఫిక్​ తో స్థంభించిన ఢిల్లీ

By udayam on December 24th / 5:09 am IST

క్రిస్‌మస్ పర్వదినం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న సంబరాల కారణంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో భారీ గా ట్రాఫిక్​ జామ్​ లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మంజు క టిలా, గాంధీ నగర్​ రెడ్​ లైట్​, శాస్త్రి పార్క్​, జియా సరై, మునిర్కా, ఎన్​.హెచ్​–48, గురుగ్రామ్​ బోర్డర్​ ల వద్ద తీవ్రంగా ట్రాఫిక్​ ఆగిపోయినట్లు ప్రయాణికులు ట్విట్టర్​ వేదికగా రాసుకొస్తున్నారు. వీటితో పాటు పశ్చిమ్​ విహార్​, షాలిమార్​ బాగ్​, ద్వారకా మోర్​, జిటికె బస్​ డిపో, మంజు క టిలా, సుల్తాన్​ పురి బస్​ టెర్మినల్​ కూడా వాహనాదారులతో నిండిపోయింది.

ట్యాగ్స్​