దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పోంజీ స్కీమ్‌ల పేరుతో మోసం చేసి వారి నుంచి రూ.100 కోట్లను కొల్లగొట్టిన ఆషిష్ మాలిక్‌ను ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా సెమినార్లను నిర్వహిస్తూ బాధితులకు 20 శాతం లాభాలను ఆశజూపి వారితో భారీగా పెట్టుబడులు పెట్టించాడని, ఆపై వాటితో సహా ఉడాయించేవాడని ఈఓడబ్ల్యూ అధికారులు తేల్చారు. రష్యాలోని ఓ ఆయిల్ కంపెనీలో ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు అతడు వారిని నమ్మించేవాడని తెలిపారు.