మెక్​డి: రష్యాలో వ్యాపారాన్ని మూసేస్తున్నాం

By udayam on May 17th / 4:59 am IST

ఉక్రెయిన్​పై యుద్ధంతో రష్యాను వీడుతున్న అతిపెద్ద కంపెనీల లిస్ట్​లో తాజాగా మెక్​డొనాల్డ్స్​ సంస్థ చేరింది. ఆ దేశంతో తనకున్న 32 ఏళ్ళ వ్యాపార అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. రష్యా వ్యాప్తంగా తమకు ఉన్న 850 స్టోర్లను ఈ ఏడాది మార్చి నుంచే మూసేసిన ఆ సంస్థ ఇప్పుడు వాటిని శాశ్వతంగా మూసేస్తున్నట్లు పేర్కొంది. మా సంస్థకు వ్యాపారం కంటే మానవతా దృక్పథమే ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 1990 నుంచి మెక్​డి అక్కడ వ్యాపారం చేస్తోంది.

ట్యాగ్స్​