బ్రిటన్ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్లారెన్ ఆటోమోటివ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. గురువారం సరికొత్త సూపర్ కార్ 765 LT స్పైడర్ మోడలు విడుదల చేసింది. కంపెనీ మొట్టమొదటి షోరూమ్ ను ముంబైలో ప్రారంభించింది. ఎవ్రీడే మెక్లారెన్ GT, హైబ్రిడ్ కారు ఆర్టురాలను సంస్థ విక్రయిస్తోంది.కంపెనీ సూపర్ కార్ల శ్రేణిలో 720S కూపే, స్పైడర్ వేరియంట్లతో పాటు 765LT కూపే, స్పైడర్ కార్లు ఉన్నాయి.భారత్ లో ఏడాదికి కనీసం 250 కార్లను అమ్మడమే లక్ష్యంగా ఈ కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.