5:35 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ఇంటికి సిఎస్​కె రంగులు, ధోనీ బొమ్మలు.. ధోనీపై అభిమానాన్ని చాటుకున్న తమిళనాడు యువకుడు 2 weeks ago

భారత మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీపై ఉన్న అభిమానాన్ని ఆయన అభిమానులు పలు విధాలుగా చూపిస్తుంటారు. అయితే తమిళనాడులోని గోపీకృష్ణ మాత్రం అందరినీ మించి పోయాడు. ఏకంగా తన ఇంటి మొత్తాన్ని, ఐపిఎల్​లో ధోనీ సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు కలర్స్​లోకి మార్చేశాడు.

మొదటి నుంచీ మహేంద్ర సింగ్​ ధోనీ ఫ్యాన్​ అయిన చెన్నై వాసి గోపి కృష్ణన్​ దుబాయ్​లో ఫారెక్స్​ ట్రేడర్​గా పనిచేస్తున్నాడు. తన స్వగ్రామానికి సెలవుల నిమిత్తం వచ్చిన ఆయన ధోనీ, సిఎస్​కె మీద ఉన్న అభిమానానికి గుర్తుగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. దీంతో తన ఇంటి మొత్తానికి ఆ జట్టు కలర్స్​ వేయాలన్న ఆలోచన రావడంతో తన స్నేహితుడైన గవర్నమెంట్​ స్కూల్​ డ్రాయింగ్​ మాస్టర్​ పొన్​ సెల్వరసు సహాయం తీసుకున్నాడు.

అతను స్ట్రోక్​ స్కెచ్​ సాయంతో చెన్నై జట్టు లోగో, మహేంద్ర సింగ్​ ధోనీ చిత్రాలను అచ్చుగుద్దినట్లు ఇంటిపై పెయింట్​ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ చిత్రాలు ఇంటర్నెట్​లో వైరల్​ అవుతున్నాయి. చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు అధికారిక ట్విట్టర్​ ఖాతాలో సైతం వీటిని ఉంచి అతని అభిమానానికి థాంక్స్​ చెప్పింది.

‘‘నాకు ప్రపంచ నలుమూలల నుంచి ధోనీ అభిమానులు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ధోనీ ప్రస్తుత ఫామ్​ సరిగ్గా లేకపోవచ్చు. కానీ ఆయన ఓ లెజెండ్​. క్రికెట్​లో, జీవితంలో గెలుపోటములు సహజం. ఓటముల్లో ఉన్న తన జట్టుకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే నేను ఇలా నా ఇంటికి పెయింట్​ వేయించా. ఇందుకోసం రూ.1.5 లక్షలు ఖర్చు చేశా. ధోనీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం” అని అతడు తన అభిమానాన్ని చాటుకున్నాడు.