మంత్రి మల్లారెడ్డి వైఖరిపై ఎమ్మెల్యేల నిరసన

By udayam on December 19th / 10:50 am IST

పార్టీ పదవులు, నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై మేడ్చల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్‌రెడ్డి, వివేకానంద్‌, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు. దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఈ సమావేశం జరిగింది.

ట్యాగ్స్​