రాధ డ్యాన్సుకు చిరంజీవి ఫిదా

By udayam on November 23rd / 10:09 am IST

ఇటీవల దక్షిణాదికి చెందిన 80వ దశకం సినీ తారలు ముంబయిలో గెట్ టుగెదర్ పార్టీలో కలిసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు జాకీష్రాఫ్​, పూనమ్​ థిల్లాన్​ లు పాల్గొన్న ఈ వీడియోలో ఒకప్పటి స్టార్​ హీరోయిన్​ రాధ చేసిన డ్యాన్స్​ కు చిరంజీవి మురిసిపోయారు. అప్పట్లో చిరంజీవికి ఈడుజోడు అన్నట్టుగా వేగంగా డ్యాన్స్ చేసి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రాధ… ముంబయిలో జరిగిన కార్యక్రమంలోనూ ఆనాటి స్టయిల్ ను మిస్ కాకుండా డ్యాన్స్ చేశారు. ఓ హిందీ హిట్ పాటకు ఆమె స్టెప్పులు వేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి వావ్, ఫెంటాస్టిక్ అంటూ ముగ్ధుడయ్యారు.

ట్యాగ్స్​