వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాని హీరోయిన్ శృతి హాసన్ పై ఈ మూవీ హీరో చిరంజీవి ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న బాలకృష్ణ మూవీ ‘వీర సింహారెడ్డి’ ఈవెంట్ కు హాజరైన శృతి హాసన్ అక్కడ ఏం తిన్నదో ఏమో.. ఆరోగ్యం బాలేదట. లేదా ఆమెను ఎవరన్నా బెదిరించీ ఉండొచ్చు’ అంటూ నవ్వుతూనే కాస్త ఘాటుగా స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యలకు పక్కనే ఉన్న రవితేజ కూడా నవ్వుతూ కనిపించాడు. అయితే ఈ ఈవెంట్ కు ముందు శృతి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్టు ఆ పోస్ట్ లో వెల్లడించింది.
ఇది అసలు బుద్ది. pic.twitter.com/yjFNeAc36w
— Hanu ™ (@HanuNews) January 8, 2023