మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి సినిమా ఉప్పెన తోనే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన `ఉప్పెన` చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది.
వంద కోట్ల రూపాయల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కీలక పాత్ర వహించాడు.
పాటలు, నేపథ్యం సంగీతంతో `ఉప్పెన`ను దేవి మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసిస్తూ దేవిశ్రీకి మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక బహుమతిఅందించారు.
OMG ! 😍
This MEGA GIFT & LETTER frm 1 & Only MEGASTAR Dearest @KChiruTweets Sir made my DAY & YEAR🎶❤️🙏🏻😍I made a Video 2 share it with U all coz a Tweet cant do Justice😁🎶
Lov U Chiru Sir..Always ❤️🎶🙏🏻@MythriOfficial #Uppena https://t.co/Tn7CqQ16QM
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 21, 2021
దేవిని అభినందిస్తూ ఓ లేఖను కూడా పంపించారు. మెగా బహుమతిని, అభినందన లేఖను దేవి ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ `ఉప్పెన` విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతం ఇస్తావో.. కొత్త వారికి కూడా అంతే ఫ్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రేమతో చిరంజీవి అంటూ చిరు ఆ లేఖలో పేర్కొన్నారు.