ఆత్మకూరు స్థానానికి విక్రమ్​ రెడ్డి నామినేషన్​

By udayam on June 2nd / 10:21 am IST

ఈనెల 23న జరగనున్న ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. బుధవారమే సిఎం జగన్​ చేతుల మీదుగా బీఫారం అందుకున్న విక్రమ్​ ఈరోజు నామినేషన్​ను సమర్పించారు. విక్రమ్​ వెంట మంత్రి కాకాణి గోవర్థన్​ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్​సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఈనెల 26న విడుదల కానున్నాయి.

ట్యాగ్స్​