2.29 కోట్ల పోస్ట్​ లను డిలీట్​ చేసిన ఫేస్​ బుక్​

By udayam on December 23rd / 12:58 pm IST

గడిచిన నవంబర్​ నెలలో 2.29 కోట్ల పోస్ట్​ లను ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రామ్​ వేదికల నుంచి తొలగించినట్లు మెటా సంస్థ ప్రకటించింది. తన నెలవారీ రిపోర్ట్​ లో మెటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫేస్​ బుక్​ లో 1.95 కోట్ల పోస్ట్​ లను, ఇన్​ స్టాగ్రామ్​ లో 33.9 లక్షల పోస్ట్​ లను బ్లాక్​ చేశామని పేర్కొంది. వీటిల్లో 18 లక్షల అడల్ట్​ న్యూడిటీ పోస్ట్​ లు, 12 లక్షల వయలెంట్​, గ్రాఫిక్​ కంటెంట్​ ఉన్నట్లు తెలిపింది. వీటితో పాటు 1.49 కోట్ల స్పామ్​ ఖాతాలను కూడా ఆయా ప్లాట్​ ఫాంల నుంచి డిలీట్​ చేసినట్లు మెటా వెల్లడించింది.

ట్యాగ్స్​