3:52 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

కోల్​కతాపై ముంబై సునాయాస విజయం.. డికాక్​ సూపర్​ ఇన్నింగ్స్​ 2 weeks ago

దుబాయ్​: ఐపిఎల్​ 2020లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై – కోల్​కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ముంబై కి సునాయాస విజయం దక్కింది. ఓ పక్క కెప్టెన్సీ మార్పుతో తడబడ్డ కోల్​కతాను ముంబై బౌలర్లు ఆది నుంచీ కోలుకోనివ్వలేదు.

ముంబై కి 2 పాయింట్లు ఇచ్చేద్దాం అన్నట్లు సాగింది కోల్​కత్తా ఇన్నింగ్స్​ మొత్తం. ఆ జట్టు మొత్తంలో పోరాటేతత్త్వం లేనట్టు, ముంబై బౌలర్లు అంటే భయమన్నట్లు సాగింది కోల్​కతా బ్యాటింగ్​. ముందుగా టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోల్​కతా 11 ఓవర్లు ముగిసేటప్పటికే 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేసింది.

త్రిపాఠి, గిల్​, నితిష్​ రాణా, దినేష్​ కార్తిక్​, రస్సెల్​లు ఏ మాత్రం పోరాటం చేయలేదు. ఈ క్రమంలో బ్యాటింగ్​కు వచ్చిన ప్యాట్​ కమిన్స్​ (53), కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​(39)తో చివరి దాకా పోరాడి జట్టుకు గౌరవప్రమదమైన స్కోర్​ను అందించాడు. ఈ క్రమంలో ఐపిఎల్​ తన తొలి హాఫ్​ సెంచరీని సైతం నమోదు చేశాడు కమిన్స్​.

దీంతో నిర్ణీత 20 ఓవర్లకు కోల్​కతా 148 పరుగులు చేసింది. అనంతరం ఛేధనకు దిగిన ముంబై కేవలం 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేశారు. ముంబై జట్టులో వికెట్​ కీపర్​ క్వింటన్​ డికాక్​ (78) మరోసారి తన బ్యాటింగ్​తో తన జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. అతడు ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో ఇది 3వ హాఫ్​ సెంచరీ కావడం విశేషం.

రోహిత్​ శర్మ (35), సూర్య కుమార్​ యాదవ్​ (10), హార్ధిక్​ పాండ్య (21) లు డికాక్​కు సహకరించారు. డికాక్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది. ఈ విజయంతో దీంతో ముంబై తిరిగి 12 పాయింట్లతో తిరిగి టేబుల్​లో మొదటి స్థానానికి చేరుకోగా కోల్​కతా 8 పాయింట్లతో 4వ స్థానంలోనే కొనసాగుతోంది.