అంటార్కిటిక్​ మంచులో మైక్రో ప్లాస్టిక్​

By udayam on June 9th / 10:16 am IST

భూగోళం ప్రతీ ఇంచునూ కమ్మేస్తున్న ప్లాస్టిక్​ భూతం అత్యంత సుందరమైన అంటార్కిటిక్​ మంచు ఖండాన్ని సైతం ఆవహిస్తోంది. అక్కడ కురిసిన మంచులో భారీ స్థాయిలో మైక్రో ప్లాస్టిక్​ రేణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడి ప్రతీ లీటరు నీటిలో సగటున 28 ప్లాస్టిక్​ రేణువులు ఉంటున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఈ ఖండంలో మంచు వేగంగా కరిగిపోయే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇలా ఈ ఖండంలోని మంచులో ప్లాస్టిక్​ రేణువులు బయటపడడమూ ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ట్యాగ్స్​