మిడిల్​ క్లాస్​కే భారీ నష్టం

By udayam on April 13th / 11:05 am IST

మధ్య, ఎగువ మధ్య స్థాయి కుటుంబాల వారికే తెలంగాణలో కరోనా కష్టాలు అధికంగా ఉంటున్నాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. దాదాపు 5 వేల మంది ఈ తరగతులకు చెందిన ప్రజలు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ‘కరోనా మొదటి వేవ్​లో దిగువ స్థాయి జనాలకు ఎక్కువగా వైరస్​ వ్యాపించేది. ఇప్పుడు మధ్య, ఎగువ మధ్య స్థాయి కుటుంబాల వారు ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే ఆసుపత్రులకు అధిక సంఖ్యలో పేషెంట్లు రావడం జరుగుతోంది’ అని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ జి.శ్రీనివాసరావు అన్నారు.

ట్యాగ్స్​