కొత్తగూడెంలో స్వల్ప భూకంపం.. ఇళ్ళ నుంచి ప్రజలు పరుగులు

By udayam on December 15th / 11:47 am IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం భూమి కొద్ది క్షణాలు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులుపెట్టారు. పాల్వంచలో సరిగ్గా 2.13 గంటలకు భూమి కంపించింది. భూకంపం ధాటికి.. ఇళ్లలోని వస్తువులు వాటంతట అవే కింద పడిపోయాయి. కొన్ని చోట్ల గోడలు బీటలు వారినట్టు తెలుస్తుంది. ఒక్క‌సారిగా భూమి కంపించ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జరగలేదని అధికారులు చెపుతున్నారు. కాసేపటికే.. అంతా సద్ధుమణగటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్​