హైదరాబాద్‌: కార్పొరేటర్ మేనల్లుడి దారుణ హత్య

By udayam on December 20th / 4:04 am IST

హైదరాబాద్‌లోని లలితా బాగ్‌లో కార్పొరేటర్ ఆజం షరీఫ్ మేనల్లుడు ముర్తుజా అన్సారీ (18) దారుణ హత్యకు గురయ్యాడు. కార్పొరేటర్ కార్యాలయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అన్సారీని కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న భవానీనగర్ పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ట్యాగ్స్​