గనుల అక్రమ తవ్వకాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, బిజెపి నేత గాలి జనార్దన్‌రెడ్డి కొత్త పార్టీని స్థాపించారు. బిజెపి నాయకత్వం ఆయన్ను బుజ్జగించేందకు రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ, పార్టీపై తీవ్ర అసంతఅప్తితో ఉన్న ఆయన ఆదివారం కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీ తరపున 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసినట్టు సమాచారం.