ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసింది. వైకాపా ప్రస్తుత ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు, న్యాయవాది నిరంజన్ రెడ్డికి, బీద మస్తాన్ రావు పేర్లను ఖరారు చేశారు. కిల్లి కృపారాణి పేరునూ ఫైనల్ చేస్తారని భావించినా చివరి దఫా చర్చల్లో ఆమెకు చోటు దక్కలేదు. ఈ విషయాన్ని మంత్రి బొత్స ప్రకటించారు.