మీడియాకు టికెట్​ ధరలు ఒక్కటే సమస్యా? : నాని

By udayam on January 12th / 6:31 am IST

ఆంధ్రప్రదేశ్​లోని మీడియాకు సినిమా తప్ప వేరే వ్యాపకం లేదని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఎడ్ల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు సినిమా టికెట్ల విషయంపై ప్రశ్నించగా ‘ఇది తప్ప మీడియాకు వేరే పని లేదా? ప్రజలకు అవసరమైన విషయాలపై మీరు స్పందించండి. టికెట్​ రేట్లు తప్ప సమస్యలేమీ లేనట్లు మాట్లాడతారెందుకు?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​