ఆ విమానాన్ని కూల్చింది రష్యానే !

By udayam on June 10th / 7:03 am IST

2014లో మలేషియా విమానం MH17 కూలిపోవడానికి రష్యాకు చెందిన బియుకె మిస్సైల్​నే కారణమని డచ్​ న్యాయమూర్తులు వెల్లడించారు. ఆ సమయంలో ఉక్రెయిన్​ పైకి యుద్ధం ప్రకటించిన రష్యా ఆ దేశ గగనతలంలోకి వచ్చిన ఈ విమానం పైకి మిస్సైల్స్​ను ప్రయోగించినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 298 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించి 3 గురు రష్యన్లు ఒక ఉక్రెయిన్​ వ్యక్తిపై దర్యాప్తు కొనసాగుతోంది.