వైకాపా ఎమ్మెల్యేకు షాక్​: చేపల కూర పంపిస్తా.. తినండి.. అంతేకాని ఓటు అడగకండి

By udayam on November 24th / 9:56 am IST

పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కు సొంత నియోజకవర్గం లో షాక్ తగిలింది. వైస్సార్సీపీ పార్టీ కి ఓటు వేయాలని కోరగా..ఆ ఒక్కటి అడగొద్దు..మా ఓటు టీడీపీ పార్టీకే అని తేల్చి చెప్పాడు ఓ హోటల్​ నిర్వాహకుడు. గడప గడపకు.. కార్యక్రమంలో భాగంగా పాపారావును ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడు పాపారావు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ఇవ్వొద్దని, పింఛన్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. దీనికి సరేనన్న ఎమ్మెల్యే చిట్టిబాబు.. వైస్సార్సీపీ పార్టీకే ఓటేయాలని పాపారావును కోరారు. అయితే, చేపల కూర పంపిస్తున్నాం తినండి కానీ, మా ఓటు మాత్రం టీడీపీకే వేస్తామని సదరు హోటల్ నిర్వాహకుడు తేల్చిచెప్పాడు. ‘మీరు జై జగన్ అన్నా.. మేం టీడీపీకే ఓటు వేస్తాం’ అని చెప్పి షాక్ ఇచ్చారు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే మరోమాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు.

ట్యాగ్స్​