తెలంగాణ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ఇద్దరికి నోటీసులు

By udayam on November 23rd / 6:57 am IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందన్నట్టుగా భావిస్తున్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులు ఇచ్చింది. బుధవారంనాడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి తుషార్, జగ్గుస్వామితో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభించడంతో… వారిని విచారణకు పిలిపించేందుకు సిట్ అధికారులు యత్నించారు. అయితే వారిద్దరూ కనపించకపోవడంతో వారిపై అవుట్ లుక్ సర్క్యులర్ జారీ చేశారు.

ట్యాగ్స్​