కీరవాణి: ఈ అవార్డ్​ నాకొక్కడిదే కాదు

By udayam on January 11th / 4:59 am IST

లాస్​ ఏంజెలిస్ లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్స్​ లో నాటు నాటు పాటకు అవార్డ్​ దక్కడంపై దేశం మొత్తం కీరవాణిని అభినందిస్తోంది. అవార్డు అందుకున్న అనంతరం ఈ పాటకు వచ్చిన అవార్డ్​ తనకొక్కడిదే కాదని కీరవాణి అన్నారు. “ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకు మాత్రమే సొంతం కాదు. నా సోదరుడు, చిత్ర దర్శకుడు రాజమౌళికి, నాటు నాటు పాటకు ఏనిమేషన్ అందించిన ప్రేమ్ రక్షిత్‌కు, అరేంజ్మెంట్స్ సమకూర్చిన కాలభైరవకు, గేయ రచయిత చంద్రబోస్‌కు, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు, పాటకు జోష్‌తో డాన్స్ చేసిన జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు, ఈ పాటను ప్రోగ్రాం చేసిన సాలూరి సిద్ధార్థ్, జీవన్ బాబులకు ఈ అవార్డ్ దక్కుతుంది. ప్రత్యేకంగా నా భార్య శ్రీవల్లికి కృతజ్ఞతలు” అని అన్నారు.

ట్యాగ్స్​