అసెంబ్లీలో సెల్​ఫోన్స్​కు బ్యాన్​ : తమ్మినేని

By udayam on November 26th / 10:12 am IST

ఇకపై ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీలోకి సభ్యులెవరూ సెల్​ఫోన్స్​ను తీసుకురాకూడదని స్పీకర్​ తమ్మినేని సీతాం ఆదేశించారు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19న చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయన మైక్​ను స్పీకర్​ కట్​ చేయడంతో టిడిపి సభ్యులు ఆ తతంగం మొత్తాన్ని సెల్​ఫోన్​లో రికార్డ్​ చేయగా అది వైరల్​ అయింది. అందులోనే వైకాపా సభ్యుల వ్యాఖ్యలు కూడా నమోదు కావడంతో ఇకపై అలాంటి పరిణామాలు జరగకుండా సెల్​ఫోన్లను బ్యాన్​ చేశారు.

ట్యాగ్స్​