ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో మంగళవారం దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే పలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు కూడా మాక్‌డ్రిల్స్‌లో పాల్గొంటున్నారు. ఆస్పత్రుల్లో ఐసోలేషన్, పడకల సామర్థ్యం, ఐసియు, వెంటిలేటర్ తదితర సదుపాయాలపై దృష్టిసారిస్తున్నారు. కరోనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఔషధాల కోసం ముందస్తుగా రూ.104 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.