దేశంలో పాండమిక్ దశ మొదలైన నాటి నుంచే కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ రేటింగ్ సైతం పై పైకి దూసుకుపోతోందని ఓ సర్వేలో తేలింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజల నమ్మకం తగ్గకపోగా పెరిగిందని లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. గతేడాది అప్రూవల్రేటింగ్ 51 శాతంగా ఉండగా ప్రస్తుతం అది 67 శాతానికి పెరిగిందని తెలిపింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రజలు నమ్మడమే ఇందుకు కారణమని తెలిపింది.