మోయిన్​ ఆలీ: టి20 వరల్డ్​కప్​ ఫేవరెట్​ భారత్​నే

By udayam on October 3rd / 11:55 am IST

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్​ కప్​కు ఇంగ్లాండ్​ జట్టు ఫేవరెట్​ కాదని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్​ మోయిన్​ ఆలీ చెప్పాడు. పాక్​తో సిరీస్​ను గెలుచుకున్న అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చాడు. ‘వచ్చే ప్రపంచకప్​లో మేం ఫేవరెట్లం కాదని భావిస్తున్నాం. భారత్​, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లు మా కంటే ఈ రేసులో ముందున్నాయి. ఆ రెండు జట్లూ కప్​ కోసం బలంగా సిద్ధమయ్యాయి. అయితే మా జట్టు అత్యంత ప్రమాదకర జట్లలో ఒకటి’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​